Pawan Kalyan: పవన్ కల్యాణ్ తో ఎలా?... జయప్రకాశ్ నారాయణ్ ఇంటికి ఉండవల్లి!

  • నిన్న ఉండవల్లితో పవన్ చర్చలు
  • మరికాసేపట్లో జేపీతో ఉండవల్లి భేటీ
  • జేఏసీ ఏర్పాటుపైనే చర్చలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అనంతరం తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వంటి కీలక హామీలను సాధించుకునేందుకు ఓ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేద్దామని పిలుపునిస్తూ, జనసేన అధినేత పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి చర్చిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను, ఆదివారం నాడు కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ను పవన్ కలిసిన సంగతి తెలిసిందే.

ఇక పవన్ విషయంలో ఎలా ముందుకు సాగాలన్న అంశంపై జయప్రకాశ్ తో చర్చించాలని ఉండవల్లి నిర్ణయించారు. పవన్ తో భేటీ అనంతరం జయప్రకాశ్ మాట్లాడుతూ, పవన్ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లి, జయప్రకాశ్ కలవడం కొత్త చర్చలకు తెరలేపింది. పవన్ తనతో మాట్లాడిన అంశాలను జేపీ దృష్టికి తీసుకు వెళ్లనున్న ఉండవల్లి, ఆయనతో మాట్లాడిన తరువాతనే జేఏసీలో చేరాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News