governor narasimhan: గవర్నర్ నరసింహన్ దంపతులను కలసిన ఆమ్రపాలి ... పెళ్లికి రావాలంటూ ఆహ్వానం
- రాజ్ భవన్ లో గవర్నర్ ని ఈరోజు కలసిన ఆమ్రపాలి
- తన వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన వరంగల్ కలెక్టర్
- ఈ నెల 18న జమ్మూకశ్మీర్ లో ఆమ్రపాలి-సమీర్ వివాహం
ఈ నెల 18న వరంగల్ జిల్లా కలెక్టర్ కాటా ఆమ్రపాలి రెడ్డి, ఐపీఎస్ అధికారి సమీర్ వివాహం జమ్మూ కశ్మీర్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఆమె తన పెళ్లి శుభలేఖను అందజేశారు. తన వివాహానికి రావాలంటూ గవర్నర్ దంపతులను ఆమె ఆహ్వానించారు.
హైదరాబాద్ లో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు, మంత్రులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 23న వరంగల్ లో, 25న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆమ్రపాలి, సమీర్ జంట హనీమూన్ నిమిత్తం 26వ తేదీన టర్కీ వెళ్లనున్నారు.