చంద్రబాబు ఇంటి వద్ద న్యాయవాదుల ఆందోళన.. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్!
- చంద్రబాబును కలిసేందుకు న్యాయవాదుల యత్నం
- అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. ఉద్రిక్తత
- రోడ్డుపై బైఠాయించి, నినాదాలు
- చంద్రబాబు సొంత జిల్లాలో ఏర్పాటు చేసినా ఓకే అన్న అడ్వకేట్లు
హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అది సీమవాసుల హక్కని ఈ సందర్భంగా న్యాయవాదులు పేర్కొన్నారు. ఏపీ అంటే ఒక్క అమరావతి, గుంటూరు మాత్రమే కాదని అన్నారు. చంద్రబాబు పుట్టిన జిల్లా అయిన చిత్తూరులో ఏర్పాటు చేసినా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే తప్పకుండా రాయలసీమలోనే ఉండాలన్నది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా అమరావతిలో హైకోర్టును నిర్మిస్తే స్టే తెచ్చి ఆపేస్తామని హెచ్చరించారు.