guntur: నాగార్జున వర్శిటీలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తుల బృందం

  • ఏఎన్ యూలో భవనాలను పరిశీలించిన బృందం
  • తుళ్లూరు మండలం నేలపాడులో స్థల పరిశీలన
  • న్యాయమూర్తుల బృందాన్ని కలిసిన రాయలసీమ హైకోర్టు సాధన సమితి ప్రతినిధులు
  • రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని వినతి

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏ.ఎన్.యూ) లో హైకోర్టు న్యాయమూర్తుల బృందం ఈరోజు పర్యటించింది. ఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు నిమిత్తం అక్కడి భవనాలను పరిశీలించింది. ఈ బృందం వెంట కలెక్టర్ శశిధర్ కూడా ఉన్నారు. తుళ్లూరు మండలం నేలపాడులోనూ పర్యటించిన ఈ బృందం, హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించింది.

కాగా, ఈ బృందాన్ని రాయలసీమ హైకోర్టు సాధన సమితి ప్రతినిధుల బృందం కలిసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఓ వినతిపత్రం అందజేసింది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారని, ఇప్పుడేమో, అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేస్తున్నారని విమర్శించింది. ఇదిలా ఉండగా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు నివాసం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. గత ఇరవై రోజులుగా తాము ఆందోళనలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

More Telugu News