Arun Jaitly: ఏపీకి ఇచ్చిన హామీలపై జైట్లీతో సమావేశమై చర్చిస్తోన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌

  • ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తాం
  • కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మేకన్‌హౌస్‌ రూపొందించిన నివేదిక ఎల్లుండి రాబోతోంది
  • ఎంపీలకు వివరించిన జైట్లీ

ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఏపీకి న్యాయం చేయాల్సిందేనని కోరుతోన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేశ్ ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. నిన్న రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో నిర్వహించిన భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం చర్యలు చేపట్టాలని జైట్లీని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు విషయంపై ఆయా శాఖల అధికారులతో చర్చిస్తామని జైట్లీ చెప్పినట్లు సమాచారం. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి మేకన్‌హౌస్‌ రూపొందించిన నివేదిక ఎల్లుండి రాబోతోందని జైట్లీ తెలిపారు.

  • Loading...

More Telugu News