Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. లారీ క్యాబిన్ లోకి వెళ్లి పడ్డ బస్సు డ్రైవర్!

  • సహాయక చర్యలు ప్రారంభం
  • ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తుండగా ప్రమాదం
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
ప్రయాణికులతో వెళుతోన్న ఆర్టీసీ బస్సు, లారీ పరస్పరం ఢీకొనడంతో 50 మందికి గాయాలయిన ఘటన సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్‌ మండలం శివంపేట శివారులో చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటనలో గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ బస్సు హైదరాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. కాగా, రెండు వాహనాలూ వేగంతో వచ్చి ఢీకొనడంతో బస్సు డ్రైవర్ వెళ్లి లారీ క్యాబిన్ లో పడి ఇరుక్కుపోయాడు. 
Road Accident
Sangareddy District
rtc bus

More Telugu News