lavanya tripathi: పాపం .. లావణ్య త్రిపాఠికి మళ్లీ నిరాశే ఎదురైంది

  • ఆ మధ్య వరుస సక్సెస్ లు 
  • ఈ మధ్య వరుస పరాజయాలు 
  • అయోమయంలో లావణ్య త్రిపాఠి
తెలుగులో క్రేజ్ వున్న కథానాయికలలో లావణ్య త్రిపాఠి ఒకరు. 'అందాల రాక్షసి'తో తెలుగు తెరకి పరిచయమైన ఈ సుందరి, ఆ తరువాత 'భలే భలే మగాడివోయ్'తో భారీ హిట్ కొట్టేసింది. ఆ వెంటనే 'సోగ్గాడే చిన్నినాయనా' .. ' శ్రీరస్తు శుభమస్తు' హిట్స్ తో తన క్రేజ్ ను మరింతగా పెంచేసుకుంది. మిగతా కథానాయికలకు లావణ్య త్రిపాఠి గట్టి పోటీ ఇస్తుందని ఈ సమయంలోనే అంతా అనుకున్నారు.

కానీ కొంతకాలంగా ఆమె వరుస పరాజయాలతో సతమతమైపోతోంది. వరుణ్ తేజ్ తో చేసిన 'మిస్టర్' .. నాగచైతన్యతో చేసిన 'యుద్ధం' .. శర్వానంద్ తో చేసిన 'రాధా' .. రామ్ తో చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు సక్సెస్ కి దూరంగా నిలిచిపోయాయి. తాజాగా సాయిధరమ్ తేజ్ తో జోడీకట్టిన 'ఇంటిలిజెంట్' కూడా ఆమె అభిమానులను నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అందాలను ఆరబోసినా ఫలితం లేకపోవడంతో, లావణ్య డీలాపడిపోయిందని అంటున్నారు.      
lavanya tripathi

More Telugu News