whatsapp: వాట్సాప్ బీటా యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌: అందుబాటులోకి వాట్సాప్ పేమెంట్స్ ఫీచ‌ర్

  • గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు ఆప్షన్లతో పాటు పేమెంట్స్ ఫీచ‌ర్
  • యూపీఐతో కనెక్ట్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది
  • ఐఓఎస్‌లోని 2.18.21 బీటా వెర్షన్‌, ఆండ్రాయిడ్‌ లోని 2.18.41 బీటా వెర్షన్‌

వాట్సాప్‌కు చెందిన బీటా వెర్ష‌న్ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై వాడే యూజ‌ర్ల‌కు వాట్సాప్ పేమెంట్స్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. గ్యాలరీ, వీడియో, డాక్యుమెంట్లు వంటి ఇతర ఆప్షన్లతో పాటు ఈ పేమెంట్స్ ఆప్షన్‌ కూడా  ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స‌ద‌రు అకౌంట్ నుంచి నేరుగా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీనికోసం యూజర్లు యూపీఐ యాప్‌ ద్వారా లేదా సంబంధిత బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

దీంతో స‌ద‌రు అకౌంట్ నుంచి నేరుగా న‌గ‌దును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే నగదు పంపేవారికి, స్వీకరించే వారికి ఇద్దరికీ కచ్చితంగా వాట్సాప్‌ ఆఫర్‌ చేసే పేమెంట్స్‌ ఫీచర్‌ ఉండాలి. ప్రస్తుతం ఈ పేమెంట్స్ ఫీచ‌ర్ ఐఓఎస్‌లోని 2.18.21 బీటా వెర్షన్‌, ఆండ్రాయిడ్‌ లోని 2.18.41 బీటా వెర్షన్‌ వారికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం వాట్సాప్ కి ఇండియా లో 200 మిలియన్ ల యూజర్ లు ఉండగా, గూగుల్ టెజ్ కి 12 మిలియన్ ల యూజర్ లు ఉన్నారు.

More Telugu News