Arun Jaitly: రాజ్యసభలో ఏపీ అంశంపై అరుణ్ జైట్లీ ప్రసంగం.. మరోసారి తీవ్ర నిరాశ

  • పాతపాటే పాడిన జైట్లీ
  • విభజన చట్టం హామీలకు సంబంధించి కొన్ని అమలు చేశాం
  • మరికొన్ని పురోగతిలో ఉన్నాయి
  • పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి

బ‌డ్జెట్‌పై రాజ్య‌స‌భ‌లో ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌సంగించారు. అయితే, ఈ ప్ర‌సంగంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు నిర్దిష్ట‌మైన హామీలు ఇవ్వ‌లేదు. ఏపీ కొత్త‌ రాజ‌ధాని, పోల‌వ‌రంకి నిధులిచ్చామ‌ని అన్నారు. ఏపీలో ఉక్కు కర్మాగారం, తదితర అంశాలకు సంబంధించిన శాఖలు పనిచేస్తున్నాయని, వాటిపై ఇప్ప‌టికే దృష్టి పెట్టామ‌ని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని చెప్పారు. ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించామని, వాటికి కూడా నిధులు ఇస్తున్నామని, ఇప్పటికే పోలవరానికి పలుసార్లు నిధులు ఇచ్చామని చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజీ ఐదేళ్లు ఇస్తామని చెప్పామన్నారు. ప్రత్యేక ప్యాకేజీ నిధులను ఈఏపీల ద్వారా ఇవ్వాలని అనుకున్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యామ్నాయ మార్గంలో నిధులు ఇవ్వాలని ఏపీ కోరిందని చెప్పారు. దీనిపై చర్చలు పురోగతిలో ఉన్నాయని, త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. రెవెన్యూ లోటుకి సంబంధించి రూ.3979.50 కోట్లు ఇచ్చామన్నారు.

విభజన చట్టం హామీలకు సంబంధించి కొన్ని అమలు చేశామని, మరికొన్ని పురోగతిలో ఉన్నాయని చెప్పారు. అరుణ్ జైట్లీ నిన్న చెప్పిన అంశాల‌నే మ‌ళ్లీ తిప్పి తిప్పి చెప్ప‌డం టీడీపీ ఎంపీల‌ను మ‌రింత ఆగ్ర‌హానికి గురి చేసే విష‌య‌మేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

  • Loading...

More Telugu News