Andhra Pradesh: బీజేపీ-టీడీపీలది భార్యాభర్తల బంధం: మంత్రి మాణిక్యాలరావు

  • ఇరు పార్టీల మధ్య అపార్థాలు తొలగిపోతాయి
  • రాష్ట్రం కోసం మరిన్ని నిధులివ్వమని చంద్రబాబు కోరుతున్నారు
  • ఇచ్చిన లెక్కల్లో స్పష్టత లేకపోయినప్పటికీ ఏపీకి కేంద్రం  నిధులు ఇచ్చింది: మాణిక్యాలరావు
బీజేపీ-టీడీపీలది భార్యాభర్తల బంధమని ఏపీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇరు పార్టీల మధ్య అపార్థాలు తొలగిపోతాయని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తపనతో కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు మరిన్ని నిధులు అడుగుతున్నారని అన్నారు. ఇచ్చిన లెక్కల్లో స్పష్టత లేకపోయినప్పటికీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని అన్నారు. కాగా, ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.  
Andhra Pradesh
manikyala rao

More Telugu News