pavan kalyan: 'అజ్ఞాతవాసి'కి సంబంధించి దిల్ రాజుకి 7 కోట్ల రిఫండ్!

  • నష్టాలు తెచ్చిన 'అజ్ఞాతవాసి'
  • దిల్ రాజుకు 7 కోట్ల నష్టం 
  • నష్టపరిహారం చెల్లించాలని నిర్మాత నిర్ణయం
హారిక అండ్ హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ క్రేజీ కాంబినేషన్ కావడంతో, భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనేశారు. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో, ఏరియాల వారీగా హక్కులను తీసుకున్నవాళ్లంతా పెద్దమొత్తంలో నష్టపోయారు. ఈ సినిమా పరాజయంపాలు కావడం వలన, దిల్ రాజు 14 కోట్ల వరకూ నష్టపోయారట.

 ఈ సినిమా వలన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఆలోచన చేసిన రాధాకృష్ణ, ఆ నష్టాల నుంచి వాళ్లను కొంతవరకూ బయటపడేయడానికి సిద్ధమవుతున్నారట. అలా ఆయన దిల్ రాజుకి 7 కోట్ల వరకూ తిరిగి చెల్లించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఫోన్ కాల్స్ వెళ్లాయట. కొందమందికి కొంత నష్ట పరిహారం .. మరికొంత మందికి తరువాత ప్రాజెక్ట్స్ కి సంబంధించిన కమిట్ మెంట్స్ ఇవ్వనున్నట్టు చెప్పుకుంటున్నారు. 'అజ్ఞాతవాసి' నిర్మాత తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి.        
pavan kalyan
keerthi suresh

More Telugu News