vishwanath: కథ వినగానే మమ్ముట్టి కన్నీళ్లు పెట్టేసుకున్నారు : కె. విశ్వనాథ్

  • మమ్ముట్టిని కలుసుకున్నాను 
  • 'స్వాతికిరణం' కథ వినిపించాను
  • ఆయన చలించిపోయారంతే  

దర్శకులు కె. విశ్వనాథ్ పేరు వినగానే 'శంకరాభరణం' .. 'సిరివెన్నెల' .. 'సాగర సంగమం' .. 'స్వర్ణ కమలం' .. 'స్వాతిముత్యం' .. 'స్వాతికిరణం' సినిమాలు గుర్తుకువస్తాయి. అవి సాధించిన ఘన విజయాలు కళ్లముందు కదలాడతాయి. ఆ సినిమాలలో 'స్వాతి కిరణం' గురించి 'విశ్వనాథమృతం'లో విశ్వనాథ్ ప్రస్తావించారు.

ఈ సినిమాకి సంగీత విద్వాంసుడుగా మమ్ముట్టి అయితే బాగుంటాడని అనిపించింది. ఆయనది మంచి విగ్రహం .. మీసాన్ని కాస్త మెలితిప్పి, నుదుటున నిలువుగా తిలకం దిద్దితే బాగుంటారనిపించింది. మలయాళంలో ఆయన పెద్ద హీరో .. చేస్తే తెలుగులో ఇదే మొదటి సినిమా అవుతుంది. అలాంటప్పుడు నెగెటివ్ టచ్ వున్న ఈ పాత్రను అంగీకరిస్తారా? అనే సందేహం కలిగింది.

అయినా వెళ్లి కథ వినిపించాను .. క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది వివరించాను. క్లైమాక్స్ సీన్ వినగానే ఆయన కన్నీళ్లు పెట్టేసుకున్నారు. అంతగా ఆ పాత్ర ఆయనను కదిలించింది. ఇక 'మాల్గుడి డేస్' చూసి మంజునాథ్ ను తీసుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News