deepika: 'పద్మావత్' వసూళ్లతో దీపికా పదుకొనే కొత్త రికార్డ్

  • తగ్గని 'పద్మవత్' వసూళ్ల జోరు 
  • ఇండియా మొత్తంగా 231 కోట్ల నెట్ 
  • ఇండియన్ టాప్ గ్రేసర్ గా నిలిచే ఛాన్స్

దేశవ్యాప్తంగా దీపికా పదుకొనేకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. 'పద్మావత్ ' సినిమా విడుదలకి ముందు నుంచి ఇప్పటివరకూ అందరూ ఆమెను గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఆమె కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనేదే అందరి మాట. అనూహ్యమైన వసూళ్లతో ఈ సినిమా ఆశ్చర్యచకితులను చేస్తోంది.

ఇంతవరకూ ఈ సినిమా ఇండియాలో 231కోట్ల నెట్ ను రాబట్టింది. 200 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన తొలి ఫిమేల్ లీడ్ ఫిల్మ్ గా ఈ సినిమాకి అరుదైన ఘనత లభించింది. ఇంతవరకూ ఫిమేల్ టైటిల్ తో వచ్చిన సినిమా ఏదీ ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు. తొలిసారిగా ఈ రికార్డు దీపికా పదుకొనే సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల ప్రవాహాన్ని చూస్తున్నవాళ్లు, ఇండియన్ టాప్ గ్రేసర్స్ లో ఈ సినిమా నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

More Telugu News