Parliament: మెడలో పాముతో... అఘోరాగా అవతరించిన ఎంపీ శివప్రసాద్!

  • మరోసారి వినూత్న శైలిలో శివప్రసాద్ నిరసన
  • పార్లమెంట్ ఎదుట బైఠాయింపు
  • మద్దతుగా నినాదాలు చేసిన టీడీపీ ఎంపీలు
పార్లమెంట్ ఎదుట తనదైన శైలిలో వినూత్నంగా నిరసనలు తెలిపే చిత్తూరు ఎంపీ శివప్రసాద్, శుక్రవారం నాడు మరో వింత వేషంతో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. తలకు పొడవాటి వెంట్రుకల విగ్గు ధరించి, అఘోరా వేషం వేశారు. మెడలో రుద్రాక్షమాల, ఒక చేతిలో పాము, మరో చేతిలో నిమ్మకాయ గుచ్చిన కత్తిని పట్టుకుని నిరసన తెలిపారు. ఆయన వెనుక తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, మురళీమోహన్, మాగంటి బాబు తదితరులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఏపీకి న్యాయం చేయాలని, విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వెంటనే మంజూరు చేయాలని స్లోగన్స్ ఇచ్చారు.
Parliament
Telugudesam
MPS
Sivaprasad

More Telugu News