Pawan Kalyan: నేనెప్పుడో ప్యాకప్ చెప్పేసిన ఆర్టిస్టుని... మళ్లీ పవన్ వచ్చి యాక్షన్ అంటున్నాడు!: ఉండవల్లి

  • పవన్ కు నా పేరు ఎవరు చెప్పారో?
  • ఆయనతో మాట్లాడింది రెండు నిమిషాలే
  • హైదరాబాద్ వెళ్లి మరోసారి మాట్లాడతా
  • ఉండవల్లి అరుణ్ కుమార్

తాను ఎప్పుడో రాజకీయాల నుంచి ప్యాకప్ చెప్పేసిన ఆర్టిస్టునని, ఇప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి మరోసారి యాక్షన్ అని అంటున్నాడని ఉండవల్లి అరుణ్ కుమార్ చమత్కరించారు. ఆయన తన మనసులో ఏమనుకుంటున్నారో ఇంకా తనకు తెలియదని స్పష్టం చేశారు. తాము కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుకున్నామని వెల్లడించిన ఉండవల్లి, ఆ రెండు నిమిషాల్లో కూడా తానేమీ మేధావిని కాదని, తన పేరు ఎవరు చెప్పారో తెలియదని పవన్ తో అన్నట్టు చెప్పారు.

పవన్ తన వద్దకు వస్తానని చెబితే, వద్దని తానే వారించానని అన్నారు. పవన్ రాజమండ్రికి వస్తే, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, అందువల్ల తానే హైదరాబాద్ కు వస్తానని చెప్పానని అన్నారు. త్వరలో హైదరాబాద్ కు వెళ్లే తాను పవన్ ను కలసి అన్ని విషయాలూ చర్చిస్తానని చెప్పారు. తనలో ఆయన ఏం చూశారో తెలుసుకోవాల్సి వుందని అన్నారు. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ వంటి నేతలు పవన్ వెంట నడిస్తే రాష్ట్రానికి మంచే జరుగుతుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News