Indian man on shraza airpotr runway: ప్రేయసిని కలవాలని ప్లాన్ వేశాడు... పట్టుబడ్డాడు.. చివరికి సాధించాడు!

  • షార్జాలోని కంపెనీలో ఇంజనీర్ గా పని చేస్తున్న ఆర్కే
  • టికెట్ లేకుండా రన్ వే పైకి పరుగెత్తి విమానం ఎక్కాలనుకున్నాడు 
  • అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచిన షార్జా పోలీసులు

ఇండియాకు చెందిన ఆర్కే (26) షార్జాలోని ఓ కంపెనీలో ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అయితే, తన ప్రేయసి ఇండియాలో ఉంది. తన పాస్ పోర్ట్ కంపెనీ యజమాని వద్ద ఉంది, ప్రేయసిని చూడాలని ఉంది..ఎలా? అని ఆలోచించాడు. ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం జరిగితే అనుకున్నది సాధించడం ఖాయం, ప్లాన్ ఫెయిలైతే ప్రాణానికే ప్రమాదం. అయినా సరే ప్లాన్ ను అమలు పరిచాడు.

అనంతరం షార్జా ఎయిర్ పోర్ట్ దగ్గరకు వచ్చాడు. ఎత్తైన గోడ ఎక్కాడు. భారత్ కు వెళ్లేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం ఎక్కేసేందుకు పరుగు ప్రారంభించాడు. దీనిని గమనించిన షార్జా పోలీసులు వేగంగా వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా జడ్జికి జరిగింది వివరిస్తూ, "నా ప్రేయసిని కలవడం కోసమే నేను విమానం ఎక్కడానికి ప్రయత్నించాను. నా ప్రేయసిని చూడకుండా నేను ఉండలేను. తనేమో ఇండియాలో ఉంది. నేనేమో ఇక్కడ ఉన్నాను. నా పాస్‌ పోర్ట్‌ ను కంపెనీ తీసేసుకుంది. ఇప్పటికి 15 సార్లు ఇండియా వెళ్లడానికి అనుమతి కోరాను. కంపెనీ ససేమిరా అంది. నా పేరెంట్స్‌ ను ఒప్పించి నా ప్రేయసిని పెళ్లాడాలని అనుకున్నాను.

కానీ, ఇండియా వెళ్లే దారేది? అందుకే.. ఎయిర్‌ పోర్ట్ గోడను దూకి, రన్‌ వేపైకి డైరెక్ట్‌ గా వెళ్లి విమానం ఎక్కి ఇండియా వెళ్దామనుకున్నాను. ఒకవేళ నేను దొరికితే.. కోర్టులో నాకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకొని నా పాస్‌ పోర్ట్‌ ను నేను తిరిగి పొందొచ్చు అని ఆలోచించాను. అంతే తప్ప ఇందులో మరే దురుద్దేశమూ లేదు" అని న్యాయమూర్తికి తెలిపాడు.

దీంతో అతని వేదన ఆసాంతం విన్న జడ్జి, అలా చేయడం తప్పు అని మందలించి, అతనికి బెయిల్ మంజూరు చేసి, కంపెనీ నుంచి పాస్ పోర్టు ఇప్పించారు. 

  • Loading...

More Telugu News