amrica: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం నిజమే... ఇది ప్రమాదకరం!: జార్జ్ బుష్

  • రష్యా జోక్యంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి
  • ఎన్నికల ప్రక్రియలో విదేశీయుల జోక్యం ప్రమాదకరం
  • ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఉండాలి

రెండేళ్ల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ వెల్లడించారు. అబుదాబిలో మిల్కన్ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో విదేశీయులు జోక్యం చేసుకోవడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఉండాలన్నారు.

కాగా, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విక్టరీ కోసం రష్యా సహాయపడిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే తేల్చిన సంగతి తెలిసిందే. ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని బుష్ సమర్థిస్తున్నారు. సదస్సులో ట్రంప్ పనితీరు, నిర్ణయాలపై ఆయన ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

More Telugu News