south koriea: కిమ్ మార్కు రాజకీయం.. ఒకవైపు దౌత్యం, మరోవైపు బలప్రదర్శన!

  • దక్షిణకొరియాలో వింటర్ ఒలింపిక్స్ కు క్రీడాకారులను పంపిన కిమ్
  • తమ ప్రతినిధిగా సోదరి కిమ్ యో జంగ్, జట్టు మేనేజర్ గా మాజీ ప్రేయసి హోన్ సాంగ్ వోల్
  • మరోపక్క ఉత్తరకొరియాలో సైనిక బలగాల ప్రదర్శన

ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. చల్లారిందనుకున్న వివాదాన్ని తట్టిలేపుతున్నారు. దక్షిణ కొరియాలో జరిగే శీతాకాల ఒలింపిక్స్‌ లో పాల్గొనేందుకు ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అంగీకరించడంతో సంధి కుదురుతుందని, ఉద్రిక్తతలు సడలుతాయని అంతా భావించారు. ఇదిలావుండగానే, మరోపక్క తన సత్తా చాటేందుకు దేశంలో సైనిక కవాతు నిర్వహించారు.

వింటర్ ఒలింపిక్స్ కు క్రీడాకారులతో పాటు ఉత్తరకొరియా ప్రతినిధిగా కిమ్ సోదరి కిమ్ యో జంగ్ ను పంపగా, వింటర్ ఒలింపిక్స్ టీమ్ మేనేజర్ గా తన మాజీ ప్రేయసి హోన్ సాంగ్ వోల్ ను పంపారు. దీంతో దక్షిణకొరియాతో తమ దేశం సన్నిహిత సంబంధాలు కోరుకుంటుందన్న సందేశం పంపారు. అయితే, వింటర్ ఒలింపిక్స్ ఇంకా ప్రారంభం కాకముందే ఉత్తరకొరియాలో కిమ్ జాంగ్ ఉన్ తన సైనిక సంపత్తిని చూపిస్తూ బలప్రదర్శన చేశారు.

 ఈ సైనిక కవాతును సతీసమేతంగా కిమ్ వీక్షించడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరకొరియా వద్ద ప్రపంచ స్థాయి సైనిక సామర్థ్యం వుందని అన్నారు. ఈ పరేడ్‌ లో అణ్వస్త్ర సామర్ధ్య ఖండాంతర క్షిపణులైన హ్వసంగ్‌-14, హ్వసంగ్‌-15లను ప్రదర్శించారు. ఇలా పరేడ్‌ లో ఉత్తరకొరియా క్షిపణులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి.

  • Loading...

More Telugu News