ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాల్సిందే: లోక్‌సభలో సీఎం రమేశ్ మండిపాటు
- ఇక పోరాటమే
- తెలుగు ప్రజలు ఓపిక పట్టే రోజులు పోయాయి
- విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందే
- కారణాలు చెబుతూ కూర్చోకూడదు
ఏపీలో పరిశ్రమల కోసం భూములు, నీళ్లు ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పామని, ఆ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదని సీఎం రమేశ్ అన్నారు. విశాఖపట్నం, విజయవాడకు మెట్రో ఇస్తామన్నారని, ఇవి పట్టించుకోకుండా కర్ణాటకలో మెట్రో అంటూ ప్రకటన చేశారని విమర్శించారు. తమకు ఏమీ ఇవ్వలేదని, వారికో న్యాయం మాకో న్యాయమా? అని ప్రశ్నించారు.