Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైతే బీజేపీతో పొత్తును వదులుకుంటాం: గంటా శ్రీనివాసరావు

  • ఏపీపై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిస్తోంది
  • కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై గంటా ఆగ్రహం 
  • కేంద్ర బడ్జెట్ బాగుందని వైసీపీ చెప్పడం సబబు కాదు
  • అభివృద్ధి నిరోధక పార్టీ వైసీపీ: మంత్రి చినరాజప్ప
రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైతే బీజేపీతో పొత్తును వదులుకుంటామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీపై బీజేపీ సవతితల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు.

కాగా, మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారని, ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. కేంద్ర బడ్జెట్ బాగుందని చెబుతున్న వైసీపీ ఆందోళన ఎందుకు చేస్తోందని, ఇది అభివృద్ధి నిరోధక పార్టీ అని చినరాజప్ప విమర్శించారు.
Andhra Pradesh
Ganta Srinivasa Rao
chinarajappa

More Telugu News