Gali Muddu Krishnama Naidu: వెంకట్రామపురంలోని తోటలో గాలి ముద్దుకృష్ణమ అంత్యక్రియలు

  • మొన్న అర్ధరాత్రి కన్నుమూసిన టీడీపీ నేత
  • చిత్తూరు జిల్లాలో అంత్యక్రియలు
  • అంతిమ యాత్రలో పాల్గొన్న ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడి అంత్యక్రియలు చిత్తూరు జిల్లా వెంకట్రామపురంలోని తోటలో జరుగుతున్నాయి. అంతకు ముందు జరిగిన అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావు, అమర్‌నాథ్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, గాలి ముద్దుకృష్ణమ నాయుడు (71) రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడి, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.
 

  • Loading...

More Telugu News