రోడ్డుపై గుండు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్యే!

  • ఉయ్యూరులో కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిరసన
  • కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • ప్రజల ఆగ్రహావేశాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా నిరసనలు-బోడె ప్రసాద్
ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఏపీ ప్రతిపక్ష పార్టీలు బంద్‌లో పాల్గొంటుండగా, మరోవైపు తమ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో టీడీపీ శాసనసభ్యులు నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కాగా, కృష్ణా జిల్లా పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఉయ్యూరులో రోడ్డుపై గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు.

ఏపీకి న్యాయం చేయాలని నాలుగు రోజులుగా తమ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహావేశాలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి గుండు చేసి పంపిన విధంగా విభజన చేశారని, అందుకే తాను గుండు చేయించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
road
Telugudesam
bode prasad

More Telugu News