Jayaprakash Narayan: జయప్రకాశ్ నారాయణతో పవన్ కల్యాణ్ భేటీ.. కాసేపట్లో కీలక ప్రకటన

  • హైదరాబాద్‌లో కొనసాగుతోన్న సమావేశం
  • ప్రత్యేక హోదా సాధనపై చర్చ?
  • జేఏసీ ఏర్పాటు చేస్తానని నిన్న ప్రకటించిన పవన్
  • భేటీ తరువాత మీడియా ముందుకు
హైదరాబాద్‌, బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణతో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను సాధించుకోవడంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నాలపై పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

నిన్న మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ తాను జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌లతో చర్చిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా గురించే పవన్ ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. పలువురు నేతలతో కలిసి పవన్ కల్యాణ్ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జేపీతో పవన్ సుమారు గంట సేపు చర్చించి, ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి కీలక ప్రకటన చేస్తారని సమాచారం.  

Jayaprakash Narayan
Pawan Kalyan
Jana Sena
jac

More Telugu News