kantarao: మా నాన్నగారు పోయిన తరువాత వాళ్లంతా మా ఇంటికి రావడం మానేశారు: కాంతారావు తనయుడు

  • సినిమాలు నిర్మించొద్దని నాన్నగారికి ఎవరూ చెప్పలేదు 
  • ఆ విషయాల్లో జోక్యం చేసుకునేంత వయసు మాకు లేదు
  • ఆయన ఎవరినీ దేహీ అని అడగలేదు  

తెలంగాణ తొలితరం కథానాయకుడిగా కాంతారావు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. కథానాయకుడిగానే కాకుండా నిర్మాతగానూ ఆయన కొన్ని సినిమాలను నిర్మించారు. అవే ఆయనను ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ విషయాలను గురించి కాంతారావు తనయుడు రాజా మాట్లాడుతూ .. " నిర్మాతగా అనుభవంలేని రంగంలోకి నాన్నగారు అడుగుపెట్టారు. వద్దంటూ ఆయనకి  సలహాలు ఇచ్చేవారు గానీ .. వారించేవారు గాని ఎవరూ లేరు"

"అప్పటికి ఈ విషయాల్లో జోక్యం చేసుకునేంత వయసు కాదు మాది. అలా ఆయన నిర్మించిన అయిదు సినిమాలు పరాజయంపాలు కావడంతో అన్నీ అమ్మేసుకోవలసి వచ్చింది. మా పరిస్థితి బాగున్నప్పుడు చాలామంది నటీనటులు మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నగారు పోయిన తరువాత వాళ్లంతా రావడం మానేశారు. మా నాన్నగారు ఎవరినీ దేహీ అని అడగలేదు .. మేము వాళ్లెవరినీ అడగాలని అనుకోవడం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.   

More Telugu News