ఆ గ్రామస్తులంతా రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు!
- బొంజా గ్రామంలో నివసించే 31 వ్యవసాయాధారిత కుటుంబాలు
- రక్షణ శాఖ కీలక స్థావరాన్ని బొంజా గ్రామంలో ఏర్పాటు
- 200 ఎకరాలకు 40.83 కోట్ల పరిహారం
దీంతో ఈ గ్రామంలోని 31 కుటుంబాల చేతుల్లోని 200 ఎకరాల భూమిని రక్షణ శాఖ తీసుకుంది. దీనికి ప్రతిగా గ్రామస్థులకు 40.83 కోట్ల రూపాయల పరిహారం ఇచ్చింది. అలా నష్టపరిహారం పొందిన కుటుంబాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యాయి. ఈ పంపకాల్లో ఒక కుటుంబానికి 6.73 కోట్ల రూపాయలందగా, మరో కుటుంబానికి 2.44 కోట్లు అందాయి. 31 కుటుంబాల్లో 29 కుటుంబాలకు కోటి 9 లక్షల రూపాయలకు పైగా నష్ట పరిహారం దక్కింది. దీంతో కోటీశ్వరులైన గ్రామంగా బోంజా రికార్డులకెక్కింది.