Loksabha: లోక్ సభలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గలాటా... తీవ్రంగా స్పందించిన స్పీకర్!

  • సెక్రటరీ జనరల్ పుస్తకాలను లాగే ప్రయత్నం చేసిన శివప్రసాద్
  • అడ్డుకున్న సిబ్బంది
  • ఆయన వైఖరిని తప్పుబట్టిన సుమిత్రా మహాజన్
లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న నిరసన నేడు కాస్తంత శ్రుతిమించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్రంగా స్పందించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్, వెల్ లోకి దూసుకెళ్లి చేసిన గలాటాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎదుట ఉన్న పుస్తకాలను శివప్రసాద్ లాగి పారేసే ప్రయత్నం చేశారు.

వెంటనే స్పందించిన ఇతర సిబ్బంది, అధికారులు శివప్రసాద్ ను అడ్డుకున్నారు. ఆపై స్పీకర్ స్పందిస్తూ, శివప్రసాద్ వైఖరిని తప్పుబట్టారు. ఈ ప్రవర్తన సరికాదని హితవు పలుకుతూ, సభను ఇలా అడ్డుకోవడం సరికాదని, నిరసన తెలిపే హక్కుందని, అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని అన్నారు.
Loksabha
Sumitra Mahajan
Chittoor
Sivaprasad

More Telugu News