Loksabha: లోక్ సభ ఉద్యోగులపై పడుతున్న టీడీపీ ఎంపీలు... వారికి దూరం జరగాలని సుమిత్ర వార్నింగ్!

  • నాలుగో రోజు కొనసాగుతున్న టీడీపీ ఎంపీల నిరసన
  • వెల్ లో నినాదాలు చేస్తున్న సభ్యులు
  • లోక్ సభ ఉద్యోగులు ఇబ్బంది పడటాన్ని గమనించిన సుమిత్రా మహాజన్
  • ఇక చర్యలకు సిఫార్సు చేస్తానని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, వరుసగా నాలుగో రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్ సభలో వెల్ లోకి దూసుకుపోయి నినాదాలు చేస్తున్న వేళ, స్పీకర్ చైర్ ముందు కూర్చుని ఉండే ఉద్యోగులు కాస్తంత ఇబ్బంది పడుతుండగా, చైర్ లో ఉన్న సుమిత్రా మహాజన్ కల్పించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు.

"నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను. దయచేసి మన లోక్ సభ ఉద్యోగుల గురించి ఆలోచించండి. వారికి దూరంగా జరగండి. వారు మీ కోసమే పని చేస్తున్నారు. వారికేమైనా జరిగితే మంచిది కాదు. అందువల్ల వారికి దూరం జరగండి" అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎంపీలు ఉద్యోగులకు దగ్గరగా వచ్చి, వారిపై పడుతున్నారని, ఇది సరికాదని చెప్పారు.

నిరసనలు విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని ఆమె కోరినా, టీడీపీ ఎంపీలు వినే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో తనకు మిగిలిన ఆప్షన్ ఒకటేనని, చర్యలకు సిఫార్సు చేస్తానని కూడా హెచ్చరించారు. సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, రాజ్యసభలోనూ టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన తెలుపుతుంటే సభను చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు.

More Telugu News