space x: ఎలాన్ మస్క్ 'కారు' అంగారకుడ్ని దాటేసిందట!

  • స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఫాల్కన్ హెవీ రాకెట్
  • ప్రయోగం విజయవంతమైందని సంబరాలు
  • కారును నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టిన ఫాల్కన్

‘స్పేస్‌ ఎక్స్‌’ (స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌) సంస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫాల్కన్ హెవీ రాకెట్‌ ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ లో అంగారకుడి కక్ష్యలో స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా రోడ్ స్టర్ కారును ప్రవేశపెట్టేందుకు పంపించారు.

 అయితే, ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ సదరు కారును ప్రవేశపెట్టాల్సిన నిర్ణీత కక్ష్యలో కాకుండా అంగారకుడి అవతల ఆస్టరాయిడ్‌ ప్రభావిత ప్రాంతంలో విడిచిపెట్టినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. ప్రయోగం విజయవంతమైందని, అయితే నిర్ణీత కక్ష్య కంటే దూరం ప్రయాణించిందని చెప్పారు. ఒకవేళ కారు సౌరవ్యవస్థ ప్రభావిత ప్రాంతంలోకి ప్రవేశిస్తే సూర్యుడి కాస్మిక్‌ కిరణాలు తగిలి కారు ముక్కలవుతుందని ఆయన తెలిపారు.

More Telugu News