smruthi irani: రేణుకా చౌదరి అలా మాట్లాడితే ఎలా?: స్మృతి ఇరానీ

  • ప్రధాని వ్యాఖ్యలకు రేణుక ప్రతిస్పందనపై స్మృతి ఇరానీ కౌంటర్
  • అప్పుడు, నేను అక్కడే ఉన్నాను
  • ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మోదీ సందర్భోచితంగా స్పందించారు:  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
ప్రధాని నరేంద్ర మోదీ తనపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. రేణుక చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురు దాడికి దిగారు. పార్లమెంట్ వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ, అప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే మోదీ సందర్భోచితంగా వాటిని తిప్పికొట్టారని అన్నారు. రేణుకపై మోదీ వ్యాఖ్యలు సమంజసమేనంటూ ఆమె సమర్థించారు. ‘మహిళ’ అనే దానిని అడ్డం పెట్టుకుని రేణుక తన ఇష్టానుసారం మాట్లాడితే ఎలా? అని స్మృతి ఇరానీ ప్రశ్నించారు.
smruthi irani
renuka chowdary

More Telugu News