Andhra Pradesh: గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలి: ఏపీ సీఎస్ దినేష్ కుమార్

  • గనులు, భూగర్భ శాఖాధికారులతో సమీక్ష సమావేశం
  • ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి 
  • అధిక ధరలకు ఇసుక విక్రయిస్తే కఠిన చర్యలు
  • సంబంధిత అధికారులకు దినేష్ కుమార్ ఆదేశం

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు గ్రానైట్ అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని తన కార్యాలయంలో గనులు, భూగర్భ శాఖాధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు లబ్ధి కలుగజేయడంతో పాటు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇసుక పాలసీ తీసుకొచ్చిందని, అయినా, అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని అన్నారు.

ఇసుక  అక్రమ రవాణాను అడ్డుకునే నిమిత్తం తీసుకుంటున్న చర్య లేమిటని ఆయన ప్రశ్నించారు. ఆయా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీలు సూచించిన ధరలకే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు ఇసుకను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వాహనాలను కూడా సీజ్ చేయాలని, ఇసుక అక్రమ రవాణాలో అధికారుల పాత్ర ఉంటే, వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ కార్యదర్శి శ్రీధర్ ను సీఎస్ ఆదేశించారు.గ్రానైట్ మైనింగ్ తో మేలు కలగాలి

గ్రానైట్ మైనింగ్ తో అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు ఉపాధి లభించాలని, అదే సమయంలో స్థానిక యూనిట్లకు ముడి సరుకులు లభ్యం కావాలనేదే గ్రానైట్ మైనింగ్ లక్ష్యమని దినేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర అవసరాలకు భిన్నంగా గ్రానైట్ ఇతర రాష్ట్రాలకు తరలిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు అనుగుణంగానే గ్రానైట్ మైనింగ్ జరగాలని ఆదేశించారు. రెండేళ్ల నుంచి గ్రానైట్ మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం వచ్చిందో, నెలల వారీగా వాటి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.  

  • Loading...

More Telugu News