Andhra Pradesh: మరి, బీజేపీ ఎందుకు న్యాయం చేయడం లేదు: కాంగ్రెస్ ఎంపీ కేవీపీ

  • ఏపీకి నాడు మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయరే?
  • టీడీపీ, బీజేపీ చర్చలు ఒట్టి నాటకం : కేవీపీ
  • తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది
  • ఒకవైపు ప్లకార్డులతో నిరసన తెలుపుతారు .. మరోవైపు మోదీ ప్రసంగానికి చప్పట్లు కొడతారు: వైసీపీ నేత కోటంరెడ్డి

రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ విభజించిందని అనడం సరికాదని, మరి, బీజేపీ ఎందుకు న్యాయం చేయడం లేదని ఎంపీ కేవీపీ ప్రశ్నించారు. శ్రీ వేంకటేశ్వరుని సాక్షిగా ఏపీకి నాడు మోదీ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ చర్చలు ఒట్టి నాటకమని, ఏపీకి న్యాయం చేసిందేమీ లేదని, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు మాటలకే పరిమితమని, చేతల్లో ఏమీ లేదని అన్నారు.

కాగా, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే విషయంపై మాట్లాడుతూ, పార్లమెంట్ లో టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, టీడీపీ ఎంపీలు ఒకవైపు ప్లకార్డులతో నిరసన తెలుపుతారని, మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగానికి చప్పట్లు కొడతారని విమర్శించారు. టీడీపీ ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, కాంగ్రెస్ తప్పు చేసిదంటున్నారు, మరి, బీజేపీ చేసిందేమిటని ప్రశ్నించారు.

More Telugu News