KJ Yesudas: 27 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిపాడిన గానగంధర్వులు

  • 'కినార్-కెని' చిత్రం కోసం ఏసుదాస్-బాలు గీతాలాపన
  • 'దళపతి'లో 'సింగారాలా...' పాట పాడిన గాయక ద్వయం
  • గృహిణి పాత్రలో జయప్రద, కలెక్టర్‌గా రేవతి

గానగంధర్వులు కేజే ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పాడారు. మలయాళ, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 'కినార్-కెని' చిత్రంలో 'అయ్యా సామి...' పల్లవితో సాగే పాట కోసం వారిద్దరూ గొంతు కలిపారు. నీటి ఎద్దడి కథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎం.జయచంద్రన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఎంఏ నిషద్ దర్శకుడు.

దీనికి డాక్టర్ అన్వర్ అబ్దుల్లా, డాక్టర్ అజూ కె.నారాయణన్ స్క్రీన్‌ప్లే అందివ్వగా, నౌషద్ షరీఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇందులో ప్రధాన తారాగణంగా జయప్రద, రేవతి, పశుపతి, పార్థిబన్, అర్చన, నజీర్, పార్వతీ, నంబియార్, ఇంద్రన్స్, రెంజీ పానిక్కర్, జోయ్ మాథ్యూ, అనూ హాసన్ నటించారు.

 గృహిణి పాత్రలో జయప్రద, తిరునల్వేలి జిల్లా కలెక్టర్ పాత్రలో రేవతి నటించినట్లు తెలిసింది. 1991లో వచ్చిన 'దళపతి' చిత్రంలో 'సింగారాలా...' పల్లవితో సాగే పాటను ఏసుదాస్-బాలు కలిసి ఆలపించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి ఆలపించిన 'అయ్యా సామి...' పాటను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/uSXtbFgR5hQ" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

More Telugu News