elan musk: అంతరిక్షంలోకి కారును పంపి... వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్!

  • అంతరిక్షంలోకి కారున పంపిన ఎలాన్ మస్క్
  • ఎలాన్ మస్క్ సంస్థ టెస్లాకు చెందిన ఎలక్ట్రిక్ కారు
  • లక్షల ఏళ్లపాటు అంతరిక్షంలో ఎలక్ట్రిక్ కారు
  • డ్రైవర్ స్ధానంలో స్పేస్ సూట్ ధరించిన మనిషి నమూనా

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌ ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన 'స్పేస్ ‌ఎక్స్‌' కంపెనీ ఈ ఫాల్కన్‌ హెవీ రాకెట్‌ ను విజయవంతంగా ప్రయోగించింది. ఇక ఇందులో మరో విశేషం ఏమిటంటే, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలోన్‌ మస్క్‌ కు చెందిన టెస్లా కారు ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లింది.

అంగారకుడి సమీప కక్ష్యలోకి ఇది చేరనుంది. కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నాసా అపోలో మిషన్‌ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించిన ప్రాంతం నుంచి 27 రాకెట్ల ఇంజిన్ ను మండించడం ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. సుమారు 23 అంతస్తుల పొడవైన ఈ జంబో రాకెట్‌ మాక్‌ పేలోడ్‌ గా కారును తీసుకెళ్లింది.

ఫాల్కన్‌ హెవీలో అంతరిక్షంలోకి వెళ్లిన కారు టెస్లా కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్‌ కారు కావడం విశేషం. లక్షల సంవత్సరాల పాటు సౌర వ్యవస్థలో ఉండిపోయే ఈ కారుకు డ్రైవర్‌ స్థానంలో స్పేస్‌ సూట్‌ ధరించిన మనిషి నమూనా ఉంటుంది. ఓ ప్రైవేట్‌ కంపెనీ భూ కక్ష్యను దాటి పేలోడ్‌ పంపించడం విశేషమైతే, కారును పేలోడ్ గా పంపడం మరో విశేషం. ఈ కారుకు సంబంధించిన వీడియోను ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దానిని మీరు కూడా చూడండి.      

  • Loading...

More Telugu News