whisky: ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ల మాదిరి విస్కీ అమ్మకాలు.. తమిళనాడులో ప్రత్యక్షం!

  • టెట్రాప్యాక్ లలో విస్కీని ప్యాక్ చేస్తున్న కర్ణాటక కంపెనీ
  • ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్లలా కనిపిస్తుండడంతో జోరుగా కొనుగోళ్లు
  • 50 శాతం లాభం వస్తుండడంతో జోరుగా విక్రయాలు

కర్ణాటకలో విస్కీని తయారు చేస్తున్న కంపెనీ దానిని టెట్రాప్యాక్ లలో మార్కెట్ చేస్తోంది. ఈ విస్కీ టెట్రాప్యాకెట్లు అచ్చం ఫ్రూట్ జ్యూస్ టెట్రా ప్యాకెట్లలా కనిపిస్తున్నాయి. కర్ణాటకలో తయారయ్యే ఈ ప్యాకెట్‌ విస్కీ విక్రయాలు తమిళనాడులోని కాంచీపురంలో జోరుగా జరుగుతున్నాయి.

చూసేందుకు ఇవి ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ల మాదిరిగా ఉండడంతో అలా భావించి పిల్లలు కొనుగోలు చేసి తాగే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీటిని తక్షణం నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్యాకెట్ ను 50 రూపాయలకు కొనుగోలు చేసి, 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. 50 శాతం లాభం ఉండడంతో వీటిని విక్రయించేందుకు కాంచీపురం వ్యాపారులు ఉత్సాహం చూపుతున్నారు. 

More Telugu News