పెళ్లి నగలు, పట్టుచీరలు కొనడంపై స్పష్టత ఇచ్చిన హీరోయిన్ శ్రియ!
- వివాహం నా స్నేహితురాలికి
- ఆమె కోసమే షాపింగ్ చేశాను
- ఇప్పట్లో పెళ్లి ఉద్దేశం లేదన్న శ్రియ
తన స్నేహితురాలి వివాహం ఉండటంతో నగలు ఆర్డర్ ఇచ్చానని, బట్టలు కొనుగోలు చేశానని చెప్పిన శ్రియ, తన వివాహం ఇప్పట్లో కాదని చెప్పింది. వచ్చే నెల రోజుల్లో రెండు ముఖ్యమైన పెళ్లిళ్లకు తాను వెళ్లాల్సి వుందని, తన షాపింగ్ కారణంగానే రూమర్స్ వచ్చాయని తెలిపింది.