kia motors: భారత కార్ల మార్కెట్లోకి కాలు పెట్టిన మరో కొరియా ఆటో దిగ్గజం... ఎస్ యూవీ మోడల్ ఆవిష్కరణ... ఏపీలో ప్లాంటు!

  • 2019 నుంచి అందుబాటులోకి
  • ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా పోటీకి సిద్ధం
  • ఏపీలో ప్లాంట్ పై రూ.1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్ లోకి దక్షిణ కొరియాకు చెందిన మరో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ ప్రవేశించింది. నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2018లో కాంపాక్ట్ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ని ఆవిష్కరించింది. 2019 మధ్య నాటికి ఇది భారత కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని కియా మోటార్స్ గ్రూపు సేల్స్ హెడ్ మనోహర్ భట్ తెలిపారు. ధర ఇంకా నిర్ణయించలేదని, అభిప్రాయాల సేకరణలో ఉన్నామని చెప్పారు.

కియా మోటార్స్ ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. ఆంధ్రప్రదేశ్ లో ప్లాంట్ ఏర్పాటు చేసే పనుల్లో ఉంది. ఇక్కడే కార్లను తయారు చేసి మార్కెట్ కు అందించనుంది. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడి నుంచి తయారయ్యే మొదటి మోడల్ తాజాగా ఆవిష్కరించిన ఎస్ యూవీయే. ఏటా 7,000 వాహనాలను తయారు చేసే లక్ష్యంతో ఉంది. ఆలస్యంగా భారత మార్కెట్లోకి ప్రవేశించినా పోటీనిచ్చేందుకు తగిన సన్నాహాలతో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికే భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News