sawmi nityananda: హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన స్వామి నిత్యానంద

  • మధురై ఆధీనం మఠం 293వ పీఠాధిపతిగా ప్రకటించుకున్న స్వామి నిత్యానంద
  • మద్రాసు హైకోర్టుకు క్షమాపణలు
  • తాను చేసిన ప్రకటన ఉపసంహరించుకుంటానని అఫిడవిట్ దాఖలు

వివాదాస్పద స్వామీజీ నిత్యానంద మద్రాసు హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. 'మధురై ఆధీనం' మఠం 293వ పీఠాధిపతిని తానేనంటూ చేసిన ప్రకటన తప్పేనని ఆయన కోర్టు ముందు ఒప్పుకుని క్షమాపణలు తెలిపారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నానని తెలుపుతూ మద్రాసు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

ఆ వివరాల్లోకి వెళ్తే... మధురై ఆధీనం 293వ పీఠాధిపతిగా నిత్యానంద తనకు తాను ప్రకటించుకున్నారు. దానిని సవాలు చేస్తూ జగదల ప్రతాపన్‌ అనే ప్రముఖుడు మద్రాసు హైకోర్టు, మధురై బెంచ్‌ లో పిటిషన్‌ వేశారు. 292వ పీఠాధిపతి జీవించి ఉండగా, తాను పీఠాధిపతినని స్వామి నిత్యానంద ఎలా ప్రకటించుకుంటారని ఆయన పిటిషన్ లో ప్రశ్నించారు.

ఒక పీఠాధిపతి జీవించి ఉండగా, ఆ మఠం ఉత్తరాధికారిగా ప్రకటించుకునే వెసులుబాటు లేదని, అన్ని అధికారాలు 292వ పీఠాధిపతికే ఉన్నాయని తెలపాలని ఆయన సదరు పిటిషన్‌ లో కోరారు. దీనిని విచారించిన న్యాయస్థానం దీనిపై సమాధానం చెప్పాలని నిత్యానందకు నోటీసులు జారీ చేయగా, కౌంటర్ అఫిడవిట్ లో న్యాయస్థానానికి నిత్యానంద క్షమాపణలు చెప్పారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. 

  • Loading...

More Telugu News