soudi arebia: విపరీత చర్య.. బుల్లి తెర నటుడి కోసం చేయి కోసుకున్న అమ్మాయి!

  • హిందీ బుల్లితెర నటుడు మోడల్‌ కుశాల్‌ టాండన్‌కు విదేశాల్లోనూ ఫ్యాన్స్‌
  • ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పిన నటుడు
  • సౌదీ అరేబియాకు చెందిన అభిమాని చేయి కోసుకుందని వివరించిన కుశాల్
  • ఇటువంటివి చేయొద్దని హెచ్చరిక
తనకు ఇష్టమైన హిందీ బుల్లితెర నటుడి కోసం సౌదీ అరేబియాకి చెందిన ఓ అమ్మాయి చేయి కోసుకుంది. ఈ విష‌యాన్ని ఇంటర్వ్యూలో తెలుపుతూ సదరు నటుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే హిందీ బుల్లితెర నటుడు, మోడల్‌ కుశాల్‌ టాండన్‌కు విదేశాల్లోనూ ఫ్యాన్స్‌ ఉన్నారు. త‌మ‌ దృష్టిని ఆకర్షించేందుకు ఫ్యాన్స్‌ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని తాను గతంలో హెచ్చరించానని కుశాల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు.

అయినప్పటికీ, కొందరు ఫ్యాన్స్‌ కావాలనే ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారని చెప్పాడు. సౌదీ అరేబియాకి చెందిన ఓ అభిమాని తన కోసం చేయి కోసుకుందని, ఆమె ఎవరో తనకు తెలుసని, ఆ అమ్మాయి ఇలా చేయడం ఏమీ బాలేదని చెప్పాడు. తాను ఇటువంటివి సహించబోనని, ఇంకెప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నానని తెలిపాడు. 
soudi arebia
television
hero
girl

More Telugu News