Kuldeep: దక్షిణాఫ్రికా పిచ్‌లపై బౌలింగ్ ఈజీ అంటోన్న యువ స్పిన్నర్లు

  • భారత్ పిచ్‌ల కంటే సఫారీ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలం
  • బౌలింగ్ ఎంజాయ్ చేస్తున్నామంటున్న యువ బౌలర్లు
  • రేపు కేప్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య మూడో వన్డే

సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ స్పిన్నర్లు చాహల్, కుల్‌దీప్‌లు సొంత గడ్డపై కంటే సఫారీ పిచ్‌లపై బౌలింగ్ సులువనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

"దక్షిణాఫ్రికా టూర్ కోసం మేం చాలా కష్టపడ్డాం. వేగవంతమైన ఇక్కడి పిచ్ లు స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదే భారత్‌లో పిచ్‌లపైనైతే బంతులు నెమ్మదిగా వెళ్తాయి. ఇక్కడ బంతులు వేగంగా బ్యాట్స్‌మెన్ వైపు దూసుకెళ్తాయి. వాటిని ఎదుర్కొనేందుకు వారికి ఎక్కువ సమయం ఉండదు. ఇక్కడ పిచ్‌లపై బౌలింగ్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నాం" అని చాహల్, కుల్‌దీప్ అన్నారు.

సెంచూరియన్ మ్యాచ్‌లో చాహల్ 8.2 ఓవర్లు వేసి, కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఆతిథ్య దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరగనుంది.

More Telugu News