rajyasabha: కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ తిప్పిపంపిన రాజ్యసభ

  • ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కేవీపీ బిల్లు
  • విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్ట్ లలో 90% వాటాను రుణంగా కాకుండా గ్రాంట్ గా ఇవ్వాలని పేర్కొన్న ఎంపీ
  • ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు, ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. అయితే, ఆయన ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును మనీ బిల్లుగా పేర్కొంటూ రాజ్యసభ తిప్పి పంపింది.

కేవీపీ సదరు బిల్లులో ఏం పేర్కొన్నారంటే...
ఏపీకి మూడు ముఖ్య ప్రయోజనాలు అందించాలి. (1) 2015 -2020 మధ్య కాలంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తి 90 :10 ఉండాలి. కేంద్ర ప్రభుత్వ వాటా 90% శాతానికి చెందిన నిధులు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో రాష్ట్రానికి అందచేయాలి.

(2 ) 2015 -2020 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్‌లో అమలు అయ్యే విధంగా ఒప్పందం అయిన అన్ని ప్రాజెక్ట్ లలో 90% వాటాను రుణంగా కాకుండా గ్రాంట్ గా ఇవ్వాలి.

(3) ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రారంభించే అన్ని పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలతో పాటు, ప్రత్యేక పన్ను మినహాయింపులు ఇవ్వాలి. 

More Telugu News