Andhra Pradesh: ఏపీ అంశం సున్నితమైంది..మోదీ ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి అనంతకుమార్

  • ఏపీకి న్యాయం చేయాలంటూ లోక్ సభలో ఎంపీల నినాదాలు
  • సభలో సభ్యులు సంయమనం పాటించాలి
  • రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సహకరించాలి
  • పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్
కేంద్రం తీరుపై టీడీపీ నేతలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ స్పందించారు. లోక్ సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళన చేయడంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ అంశం సున్నితమైందని, ఆంధ్రప్రదేశ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.

సభలో సభ్యులు సంయమనం పాటించాలని, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాగా, ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ లోక్ సభలో టీడీపీ ఎంపీలు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. స్పీకర్ వెల్ వద్దకు చేరుకుని ప్ల కార్డులతో నిరసన తెలుపుతున్న సమయంలో ఎంపీ మాగంటి బాబుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
loksabha
Telugudesam
ananth kumar

More Telugu News