ఆసుపత్రికి తరలించగా కాల్పులు.. తప్పించుకు పారిపోయిన పాకిస్థాన్ ఖైదీ
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని శ్రీ మహారాజా హరిసింగ్ ఆసుపత్రి వద్ద కలకలం చెలరేగింది. వైద్య పరీక్షల కోసం పాకిస్థాన్ ఖైదీ నవీద్‌తో పాటు పలువురు ఖైదీలను ఆ ఆసుపత్రికి తీసుకురాగా.. ఆసుపత్రి వెలుపల ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు.
అంతేగాక, ఆ సమయంలో ఖైదీ నవీద్ కూడా పోలీసుల నుంచి ఓ తుపాకీ లాక్కొని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఓ పోలీసు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరొక పోలీసులు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాల్పుల సమయంలో పాకిస్థాన్ ఖైదీ నవీద్ తప్పించుకు పారిపోయాడని, గాలింపు కొనసాగుతోందని శ్రీనగర్ పోలీసులు మీడియాకు తెలిపారు.