forbes under 30: ఫోర్బ్స్ అండర్-30 ఇండియన్స్ జాబితా విడుదల.. అత్యంత ప్రతిభావంతులైన యువత వీరే!

  • 30 ఏళ్లలోపే అద్భుతాలు సాధిస్తున్నవారితో జాబితా
  • పలు విషయాలను క్రోడీకరించి లిస్ట్ తయారు
  • జాబితాలో బుమ్రా, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, హర్మన్ ప్రీత్ కౌర్

మూడు పదుల వయసు లోపలే అద్భుతాలను సాధిస్తూ, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన 30 మందితో కూడిన అండర్-30 జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజీన్ 'ఫోర్బ్స్' ప్రకటించింది. సాధించిన విజయాలు, ప్రస్తుత పరిస్థితులను మార్చగలిగే మానసిక దృఢత్వం, తమ విజయాల ద్వారా ఇతరులపై చూపుతున్న ప్రభావం, వారి రంగాల్లో వారు వేస్తున్న ముద్ర, మరెన్ని సంవత్సరాలు వారు క్రియాశీలకంగా ఉండగలరు.. తదితర విషయాలన్నింటినీ క్రోడీకరించి ఫోర్బ్స్ ఈ జాబితాను తయారు చేసింది. మొత్తం 15 కేటగిరీల నుంచి వీరిని ఎంపిక చేశారు.

ఈ ఏటి మేటి యువత (అండర్-30) వీరే:

  • భూమి పెడ్నేకర్ - బాలీవుడ్ నటి. 
  • జుబిన్ నౌతియాల్ - సింగర్, సాంగ్ రైటర్.
  • హీనా సిద్దు - పిస్టల్ షూటర్.
  • సాహిల్ నాయక్ - శిల్పి (స్కల్ప్ టర్).
  • క్షిత్జి మార్వా - డిజైన్ ఇన్నొవేటర్. తన టీమ్ తో కలసి ప్రపంచంలోనే తొలి హోలోగ్రాఫిక్ హెడ్ సెట్ 'బొక్సిల్' ను రూపొందించాడు. స్మార్ట్ ఫోన్లు, క్వార్క్ 360 వర్చువల్ రియాలిటీ కెమెరాల్లో ఇది పని చేస్తుంది.
  • రంజన్ బోర్డోలాయ్ - డిజైనర్.
  • గౌరవ్ ముంజాల్, రొమన్ సైనీ, హిమేష్ సింగ్ - యునాకాడెమీ కోఫౌండర్లు.
  • రోహిత్ రామసుబ్రహ్మణియన్, కరణ్ గుప్తా, హిమేష్ జోషి, అర్జిత్ గుప్తా - జెఫో (ఈ కామర్స్) కోఫౌండర్లు.
  • విక్కీ కౌశల్ - నటుడు.
  • మిథిలా పాల్కర్ - నటి.
  • రంజిత్ ప్రతాప్ సింగ్, శంకరనారాయణన్ దేవరాజన్, ప్రశాంత్ గుప్తా, రాహుల్ రాజన్ - నాసాడియా టెక్నాలజీస్ కోఫౌండర్లు.
  • తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ - ఏథర్ ఎనర్జీ కోఫౌండర్లు. భారత తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ ను ప్రారంభించారు.
  • సవిత పూనియా - భారత మహిళా హాకీ జట్టు గోల్ కీపర్.
  • హర్మన్ ప్రీత్ కౌర్ - టీమిండియా మహిళా జట్టు ఆల్ రౌండర్.
  • అలెన్ అలెగ్జాండర్ కలీకల్ - ఫ్యాషల్ లేబుల్ 'కలీకల్' ఫౌండర్, క్రియేటివ్ డైరెక్టర్.
  • జస్ప్రీత్ బుమ్రా - టీమిండియా ఫాస్ట్ బౌలర్.
  • ఆదిత్య శర్మ - మెక్ కిన్సీ పార్టనర్ గా ఎదిగాడు.
  • శ్రద్ధా భన్సాలీ - క్యాండీ అండ్ గ్రీన్ ఫౌండర్.
  • గౌతమ్ భాటియా - లీగల్ రైటర్, లాయర్.
  • చిరాగ్ ఛాజర్ - వెజిటేరియన్ రెస్టారెంట్ 'బుర్మా బుర్మా' కో ఓనర్.
  • సతీష్ కన్నన్, ఎన్బాశేఖర్ దీనదయాళనే - డాక్స్ యాప్ కో ఫౌండర్స్. 2వేల మందికి పైగా స్పెషలిస్ట్ డాక్టర్ల డిజిటల్ సేవలను అందిస్తోంది ఈ యాప్.
  • దీపాంజలి దాల్మియా - హెడే కేర్ ఫౌండర్. బయో డీగ్రేడబుల్, ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ తయారు చేస్తారు.
  • రోహన్ ఎం గణపతి, యషాష్ కరణం - బెల్లాట్రిక్స్ ఏరో స్పేస్ కో ఫౌండర్లు. రాకెట్లు, శాటిలైట్లకు సంబంధించిన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కు చెందిన రీసర్చ్ మరియు డెవలప్ మెంట్.
  • పవన్ గుప్తా, నిపుణ్ గోయల్, విజయ్ వర్గియ - కరోఫి కోఫౌండర్లు. 2 లక్షలకు పైగా వెరిఫైడ్ డాక్టర్లతో సేవలు అందిస్తున్న మొబైల్ యాప్. రోజుకు 400 కంటే ఎక్కువ కేసులను డాక్టర్లు డిస్కస్ చేస్తున్నారు.
  • మనోజ్ మీనా, సిబబ్రత దాస్ - ఆటంబర్గ్ టెక్నాలజీస్ కోఫౌండర్లు. బ్రష్ లెస్ డీసీ మోటార్లతో ఫ్యాన్లను తయారు చేస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి శబ్దం వెలువడదు.
  • జాన్హవి జోషి, నుపుర కిర్లోస్కర్ - బ్లీ టెక్ ఇన్నొవేషన్స్ కోఫౌండర్స్. వినికిడి సమస్యలతో బాధపడేవారి కోసం టెక్నికల్ సేవలను అందిస్తున్నారు.
  • సుహానీ పరేఖ్ - మిషో జ్యువెలరీ ఫౌండర్, క్రియేటివ్ డైరెక్టర్.
  • అభినవ్ పాథక్, సాకేత్ బీఎస్వీ, యోగేష్ ఘాతుర్లే, సత్యనారాయణన్ - పెర్పులే కోఫౌండర్లు. ఎక్స్ ప్రెస్ చెకౌట్స్, రీటెయిల్ ఔట్ లెట్స్ లో ఈజీ పేమెంట్ల కోసం సెల్ఫ్ చెకౌట్ అప్లికేషన్ సేవలను అందిస్తున్నారు.

More Telugu News