android: విడుదలైన 18 నెలల తర్వాత మార్ష్ మాలోను వెనక్కి నెట్టేసిన ఆండ్రాయిడ్ నౌగట్

  • 28.5 శాతానికి మార్కెట్ వాటా
  • 28.1 శాతం వాటాతో తర్వాత స్థానంలో మార్ష్ మాలో
  • లాలీపాప్ మార్కెట్ వాటా 24.6 శాతం
  • ఒక శాతం ఫోన్లలోనే కొత్త వెర్షన్ ఓరియో

ఆండ్రాయిడ్ నౌగట్ 18 నెలల క్రితమే విడుదల కాగా ఆలస్యమైనా, ఎట్టకేలకు నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇన్నాళ్లూ అత్యధిక ఫోన్లలో మార్ష్ మాలోనే వాడుతున్నారు. ఇప్పటికీ నౌగట్ తర్వాత ఎక్కువ ఆండ్రాయిడ్ ఫోన్లు మార్ష్ మాలో వెర్షన్ పైనే నడుస్తున్నట్టు గణాంకాలు చూస్తే తెలుస్తోంది. ఈ మేరకు గూగుల్ ఫిబ్రవరి చార్ట్ విడుదల చేసింది. ఇక ఆండ్రాయిడ్ అత్యంత తాజా వెర్షన్ ఓరియో కేవలం ఒక శాతం ఫోన్లలోనే చేరింది.

ఆండ్రాయిడ్ నౌగట్ (రెండు వెర్షన్లు 7, 7.1 కలిపి) మార్కెట్ షేరు (వినియోగం) తాజాగా 28.5 శాతానికి చేరింది. మార్ష్ మాలో మార్కెట్ షేరు 28.1 శాతంగా ఉంది. ఇక ఆండ్రాయిడ్ లాలీపాప్ మార్కెట్ వాటా ఇప్పటికీ 24.6 శాతం స్థాయిలో ఉండడం విశేషం. ఓరియో 8 వెర్షన్ 0.8 శాతం, 8.1 వెర్షన్ 0.3 శాతం, కిట్ క్యాట్ 12 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. జెల్లీబీన్, ఐస్ క్రీమ్, శాండ్ విచ్, జింజర్ బ్రెడ్ వెర్షన్లు ఇంకా కొంత ఉనికిలోనే ఉండడం గమనార్హం.

More Telugu News