pavankalyan: పవన్ మరో సినిమా చేస్తాడంటూ టాక్!

  • పవన్ సినిమాలు చేయాలనేది అభిమానుల కోరిక 
  • పవన్ దగ్గర కొంతమంది నిర్మాతల అడ్వాన్సు లు 
  • మైత్రీ మూవీస్ వారికి .. పవన్ కి మధ్య చర్చలు
ఇంతకాలం పాటు సినిమాలు చేస్తానని తాను అనుకోలేదనీ .. అభిమానులను నిరుత్సాహపరచడం ఇష్టం లేకనే తాను సినిమాలను కంటిన్యూ చేస్తూ వస్తున్నానని చాలా సందర్భాల్లో పవన్ చెబుతూ వస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం ఆయన సినిమాలు చేయడం మానుకోకూడదనే భావిస్తున్నారు. రీసెంట్ గా 'ఇంటిలిజెంట్' ఫంక్షన్ లోను వినాయక్ మాట్లాడుతూ, సినిమాలను పవన్ పక్కన పెట్టెయ్యొద్దని కోరారు.

ఎన్నికల లోగా పూర్తి చేయవచ్చనే ఉద్దేశంతో పవన్ ఓ ముగ్గురు నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకున్నారు. అవి ఓ 20 కోట్లవరకూ వుంటాయని అంటున్నారు. పవన్ సినిమాలు చేయని పక్షంలో ఆ మొత్తం వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది .. అది కొంచెం కష్టమైన పనే. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా చేయాలని పవన్ భావిస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క సినిమా చేస్తే మిగతా సినిమాల అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయవచ్చనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. త్వరలోనే మైత్రీ మూవీ మేకర్స్ వారికి .. పవన్ కి మధ్య చర్చలు జరగనున్నట్టు చెప్పుకుంటున్నారు.  
pavankalyan

More Telugu News