Bihar: బీహార్ లో అబ్బాయిల కిడ్నాప్... బలవంతపు పెళ్లిళ్లు!

  • బీహార్ లో 'పకడ్వా వివాహ్' సంస్కృతి
  • అబ్బాయిని బలవంతంగా ఎత్తుకెళ్లి అమ్మాయిలతో వివాహం జరిపించడం
  • 2017లో 3,400 మంది అబ్బాయిలను ఎత్తుకెళ్లి వివాహాలు చేసేశారు

బీహార్ లో 'పకడ్వా వివాహ్' (బలవంతపు పెళ్లిళ్లు) సంస్కృతి పెచ్చుమీరిపోయిందని అబ్బాయిల తల్లిదండ్రులు వాపోతున్నారు. 'పకడ్వా వివాహ్' అంటే వరుడికి ఇష్టం ఉన్నా లేకున్నా ఇలా బలవంతంగా వివాహం జరిపే పధ్ధతి. బీహార్ లో ఈ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లికుమార్తె తరఫు వారు అబ్బాయిని అపహరించి, తలకు గన్ను గురి పెట్టి లేదా కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించి బలవంతంగా ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టిస్తారు.

2017లో ఇలాంటి 'పకడ్వా వివాహ్'లు సుమారు 3,400 జరిగాయని బీహార్ పోలీసులు తెలిపారు. ఈ వివాహ సమయంలో వరుడు 'నాకీ పెళ్లి వద్దు బాబోయ్' అంటూ కిందపడి ఏడ్చేసిన సందర్భాలు కోకొల్లలు. వచ్చే పెళ్లిళ్ల సీజన్‌ లో ‘పకడ్వా వివాహ్‌’లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలకు సూచించామని ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. బీహార్‌ లో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయని పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను అపహరించడంలో దేశంలో బీహారే నెంబర్ వన్ గా కొనసాగుతోంది. 

  • Loading...

More Telugu News