nithin: నితిన్ టీజర్ రిలీజ్ .. మూవీ రిలీజ్ డేట్ ఖరారైపోయాయి

  • కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ 
  • పరిశీలనలో 'గుర్తుందా శీతాకాలం'
  • ఈనెల 14న టీజర్ రిలీజ్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల

'లై' పరాజయంతో డీలాపడిపోయిన నితిన్ ఆ వెంటనే తేరుకుని,  దర్శకుడు కృష్ణచైతన్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా, నితిన్ కి 25వ సినిమా. త్రివిక్రమ్ కథను అందించిన ఈ సినిమాలో నితిన్ జోడీగా మేఘా ఆకాశ్ నటిస్తోంది. ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ నెల 12వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఇది ప్రేమకథా చిత్రం కావడం వలన .. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, ఈ నెల 14వ తేదీన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సినిమాను కూడా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉండగా, ఈ మూవీ తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని మేఘా ఆకాశ్ ఆశపడుతోంది.     

More Telugu News