Congress: కాంగ్రెస్‌పై వ్యతిరేకతతోనే ప్రజలు మాకు మద్ద‌తు ఇచ్చారు: రాజ్య‌స‌భ‌లో అమిత్ షా

  • పకోడాలు చేయడం కూడా వ్యాపారమే... అది సిగ్గు పడాల్సిన పనికాదు
  • టీ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధానిగా ఎదిగారు
  • 30 ఏళ్ల తరువాత పూర్తి ఆధిక్యంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది
  • అంత్యోదయ సిద్ధాంతం ప్రకారమే మా ప్రభుత్వం పనిచేస్తుంది

కాంగ్రెస్‌పై వ్యతిరేకతతో దేశ ప్ర‌జ‌లు త‌మ‌కు మద్దతు ఇచ్చారని, 30 ఏళ్ల తరువాత పూర్తి ఆధిక్యంతో బీజేపీ అధికారంలోకి వచ్చింద‌ని బీజేపీ జాతీయాధ్య‌క్షుడు, ఎంపీ అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ... పకోడాలు చేయడం కూడా వ్యాపారమేన‌ని, అది సిగ్గు పడాల్సిన పనికాదని వ్యాఖ్యానించారు. టీ అమ్ముకునే వ్య‌క్తి దేశ ప్ర‌ధానిగా ఎదిగార‌ని అన్నారు. అంత్యోదయ సిద్ధాంతం ప్రకారమే త‌మ‌ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలందరికీ చేరడమే అంత్యోదయ లక్ష్యమ‌ని చెప్పారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా పేదవాడికి బ్యాంకు ఖాతా లేదంటే ఏమనుకోవాలని గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌ను ఉద్దేశించి అమిత్‌ షా అన్నారు. త‌మ  ప్రభుత్వం వచ్చాక 31 కోట్ల జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు తెరిపించామ‌ని చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి తరువాత ఆ స్థాయిలో పనిచేస్తోన్న వ్యక్తి ఒక్క ప్రధాని మోదీ అని కొనియాడారు.

More Telugu News