tajmahal: తాజ్ మహల్ ఉత్సవాలు రామాయణ గాథతో ప్రారంభించాలన్న నిర్ణయంపై వివాదం

  • ఈ నెల 17 నుంచి పదిరోజుల పాటు ఉత్సవాలు
  • ఏటా మొఘల్ సామ్రాజ్యంపై కళా ప్రదర్శనలు
  • ఈ ఏడాది మాత్రం రామాయణ గాథతో ఆరంభించాలని నిర్ణయం
  • ప్రతిపక్షాల అభ్యంతరం
చరిత్రలో ఎన్నడూలేని విధంగా తాజ్ మహల్ ఉత్సవాలను 10 రోజుల పాటు నిర్వహించాలని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్ణయించడం ఒక ఎత్తు అయితే... రామాయణ విశేషాలను తెలియజేసే కళా ప్రదర్శనతో ప్రారంభించనుండడం వివాదానికి దారితీస్తోంది. తాజ్ ఉత్సవాలకు కాషాయ రంగు అద్దే ప్రయత్నంగా దీన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2018 తాజ్ ఉత్సవాలు ఈ నెల 18 నుంచి 27 వరకు జరగనున్నాయి.

ఏటా ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మొఘల్ సామ్రాజ్య విశిష్టతను తెలియజేసే కళలను ప్రదర్శించడం ఆనవాయతీగా వస్తోంది. ‘‘రామ్ లీలను అయోధ్యలో నిర్వహిస్తే అభ్యంతరం లేదు. కానీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ వద్ద నిర్వహించడంలో లాజిక్ ఏంటి? మొఘల్ సామ్రాజ్య వారసత్వం, స్మారక మందిర గొప్పతనాన్ని ప్రపంచం ముందు చెడ్డగా చిత్రీకరించడమే’’అని సమాజ్ వాదీ నేత సునీల్ సజన్ అన్నారు. 
tajmahal

More Telugu News