Jammu And Kashmir girl: నాలాంటి గతి ఎవరికీ పట్టకూడదు: కశ్మీరీ యువతి

  • జనవరి 21న మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు
  • మత్తుమందులిచ్చి అత్యాచారం, వీడియోలు చూపించి నరకం
  • బాధితురాల్ని రక్షించిన కుల్గాం పోలీసులు

తనకు ఎదురైన అనుభవం మరే బాలిక లేదా మహిళకు ఎదురుకాకూడదని కశ్మీర్ కు చెందిన మైనర్ బాలిక అంటోంది. గత నెలలో కుల్గాం పోలీసులు ఒక మైనర్ బాలికను ముగ్గురు కిడ్నాపర్ల చెరనుంచి రక్షించి, వారిని అరెస్టు చేశారు. ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

దీనిపై ఆమె సిట్ అధికారులకు వాంగ్మూలమిస్తూ, జనవరి 21న గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని తెలిపింది. తనను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మత్తుమందులిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, అనంతరం తనకు ఆ సందర్భంగా తీసిన వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేశారని కన్నీటిపర్యంతమైంది. దేవుడి దయవల్ల పోలీసులు తనను రక్షించారని తెలిపింది. తనకు పట్టిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని పేర్కొంది. నిందితులు ముగ్గుర్నీ కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. 

More Telugu News